News November 21, 2024
రీరిలీజ్లపై మహేశ్బాబు అభిప్రాయం ఇదే!

‘దేవకీ నందన వాసుదేవ’ రిలీజ్ నేపథ్యంలో మహేశ్బాబుతో హీరో గల్లా అశోక్ కలిసి ట్విటర్లో #AskSSMBandAG నిర్వహించారు. ఇందులో రీరిలీజ్లపై మహేశ్ అభిప్రాయం ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి సూపర్ స్టార్ స్పందిస్తూ.. ‘పోకిరితో స్టార్ట్ చేసి మొన్న మురారి వరకు రీరిలీజ్లు చూసినప్పుడల్లా అభిమానులు చేసిన సందడి నా పాత రోజులను గుర్తుచేశాయి. నా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్’ అని చెప్పారు.
Similar News
News November 26, 2025
ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం రాత్రి కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. అభివృద్ధి పనులు నెలాఖరులో పూర్తి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించాలన్నారు. చదువుకొని ఖాళీగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు.
News November 26, 2025
రేపటి నుంచే శుక్ర మౌఢ్యమి.. ఈ శుభకార్యాలు చేయొద్దు!

రేపటి నుంచి ఫిబ్రవరి 17వరకు శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతారు. మొత్తం 84రోజులు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగనుంది. ఈ రోజుల్లో పెళ్లి, యాత్రలు, పుట్టు వెంట్రుకలు తీయడం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పండితులు చెబుతున్నారు.
News November 26, 2025
KNR: ఆయిల్ పామ్ తోటలపై రైతులకు అవగాహన సదస్సు

కలెక్టరేట్ ఆడిటోరియంలో సహకార, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే ముఖ్య అతిథిగా హాజరై, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక లాభాలు లభిస్తాయని సూచించారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


