News September 3, 2025

వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే నా విజ్ఞప్తి: స్పీకర్

image

AP: చంద్రబాబుకు ధైర్యముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న <<17591420>>సజ్జల<<>> కామెంట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి. సభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. స్పీకర్‌గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 3, 2025

తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించిన విరాట్

image

RCB విన్నింగ్ పరేడ్‌లో జరిగిన దుర్ఘటనపై విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. ‘జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన ఎవరూ ఊహించనిది. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణంగా ఉండాల్సిన రోజు విషాదంగా మారిపోయింది. తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన అభిమానుల కోసం ప్రార్థిస్తున్నా. ఈ నష్టం ఇప్పుడు మనలో ఒక భాగం. కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా ముందుకు వెళ్దాం’ అని కోహ్లీ ఎమోషనల్ అయ్యారు.

News September 3, 2025

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారినట్లు APSDMA తెలిపింది. అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News September 3, 2025

గణపతి నిమజ్జనాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: TG పోలీస్

image

❃ విగ్రహం ఎత్తును బట్టి నిర్దేశించిన రూట్లలో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలి.
❃ నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి.
❃ పోలీస్, మున్సిపల్/పంచాయతీ సిబ్బంది సాయం తీసుకోవాలి.
❃ చెరువులు, నీటి కుంటల్లోకి దిగొద్దు. భారీ విగ్రహాల కోసం క్రేన్ వాడాలి.
❃ వాహనాలను నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోవాలి.