News June 15, 2024
ఇదే నా చివరి T20 WC: బౌల్ట్

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పే తనకు చివరిదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నారు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక ఇతర ఫార్మాట్లలో కొనసాగుతారా? అనేదానిపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. 34 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న బౌల్ట్ ఈ WCలో 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశారు. కానీ కివీస్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.
Similar News
News November 25, 2025
‘అఖండ-2’ మూవీకి అరుదైన ఘనత!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాను అవధి భాషలోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యే తొలి టాలీవుడ్ సినిమాగా నిలవబోతోందని పేర్కొన్నాయి. ఈ ఇండో-ఆర్యన్ భాషను UP, MPలోని పలు ప్రాంతాల్లో మాట్లాడుతారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా వారణాసిలో CM యోగి గెస్ట్‌గా ఓ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News November 25, 2025
లక్ష్మణుడి అగ్నిపరీక్ష గురించి మీకు తెలుసా?

ఓసారి లక్ష్మణుడు తనను కోరి వచ్చిన అప్సరసను తిరస్కరిస్తాడు. ఆగ్రహించిన ఆ అప్సరస తన నగలను మంచంపై వదిలి వెళ్తుంది. ఆ నగలను చూసిన సీతాదేవి లక్ష్మణుడి పవిత్రతను ప్రశ్నిస్తుంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి లక్ష్మణుడు అగ్నిగుండంలో నడుస్తాడు. ఇలా లక్ష్మణుడు తన నిజాయితీని, పవిత్రతను రుజువు చేసుకుంటాడు. అయితే ఈ కథ జానపద రామాయణంలో నుంచి పుట్టిందని చెబుతారు.
News November 25, 2025
అయోధ్యలో నేడు కాషాయ జెండా ఎగరవేయనున్న PM మోదీ

అయోధ్య రామాలయంలో PM మోదీ నేడు కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా 10 ఫీట్ల హైట్, 20 ఫీట్ల లెంగ్త్ ఉన్న ట్రయాంగిల్ ఫ్లాగ్‌ను ఆవిష్కరిస్తారు. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు చిత్రాలు, ఓం సింబల్ ఉంటాయి. రామ మందిరానికి 2020 AUG 5న భూమిపూజ, 2024 JAN 22న రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాగా నేడు ధ్వజారోహణ ఉత్సవం నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.


