News April 10, 2025

నా తర్వాతి సినిమా ఇదే: రామ్‌గోపాల్ వర్మ

image

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్‌. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్‌లైన్‌’ అని RGV పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

విజయనగరం జిల్లాలో జాబ్ మేళా

image

AP:విజయనగరం జిల్లాలోని మహారాజ్ కాలేజీలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ITI, డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc, MSc (నర్సింగ్), ఫార్మసీ ఉత్తీర్ణులై, 18- 45ఏళ్ల లోపు వారు అర్హులు. 280 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ కార్డ్ తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: employment.ap.gov.in

News November 16, 2025

కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 16, 2025

USలో మండుతున్న ధరలు.. సుంకాలు తగ్గించిన ట్రంప్

image

భారత్‌పై అదనపు సుంకాలు వేయడంతో అమెరికాలో పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. దాదాపు 200 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించారు. ఇందులో భారత్‌ ఎగుమతి చేసే టీ, మిరియాలు, జీలకర్ర, యాలకులు, పసుపు, అల్లం, జీడిపప్పు, మామిడి వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ సడలింపు భారత వ్యవసాయ ఎగుమతులకు పెద్ద ఊతమిస్తుంది. సీ ఫుడ్, బాస్మతి రైస్‌పై తగ్గించలేదు.