News September 30, 2024
ఇదేమీ కాఫీ షాప్ కాదు.. లాయర్‌పై CJI ఆగ్రహం

ఓ కేసు విచారణ సందర్భంగా లాయర్ ‘యా.. యా’ అంటూ మాట్లాడటంపై CJI చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇదేమీ కాఫీ షాప్ కాదు. ఈ యా యా ఏంటి? ఇలాంటి పదాలంటే నాకు చిరాకు. వీటిని ఇక్కడ అనుమతించను’ అని హెచ్చరించారు. 2018లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడాన్నిసవాల్ చేస్తూ ఈ కేసులో ఆయననే ప్రతివాదిగా చేర్చాలంటూ పిల్ దాఖలు చేశారు. గొగోయ్ పేరును తొలగించాలని CJI స్పష్టం చేశారు.
Similar News
News February 12, 2026
1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
News February 12, 2026
నాస్తికుడి కళ్లు తెరిపించిన రాఘవేంద్ర స్వామి

రాఘవేంద్ర స్వామి మహిమలు అనిర్వచనీయం. ఓసారి వేదమంత్రాలను పరిహసించిన ఓ నాస్తికుడు ఎండు రోకలి చూపి దాన్ని చిగురింపజేయమని సవాలు చేశాడు. స్వామివారు చిరునవ్వుతో మంత్రజలాన్ని దానిపై చిలకరించాడు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఆ ఎండు కర్ర కాస్త పచ్చని ఆకులతో చిగురించింది. ఈ అద్భుతం చూసిన ఆ నాస్తికుడు స్వామివారి పాదాలకు శరణు కోరాడు. ప్రకృతి నియమాలను కూడా భగవంతుని నామం మార్చగలదని ఈ ఘటన నిరూపిస్తుంది.
News February 12, 2026
విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్ ఇస్తుందో చూడాలి.


