News March 21, 2024

ఆయనకు ఇదేం కొత్త కాదు

image

ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా ధోనీ ప్రస్థానం ముగిసింది. అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే సారథిగా, ప్లేయర్‌గా ధోనీ తప్పుకున్నారు. తాజాగా CSK కెప్టెన్‌గానూ అదే విధంగా వైదొలిగారు. దీంతో ఆయనకు ఇదేం కొత్త కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కెప్టెన్సీలో సీఎస్కే సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు.

Similar News

News January 9, 2025

బాలకృష్ణలో అలాంటి అహం లేదు: హీరోయిన్

image

ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నా బిగ్ స్టార్‌ని అనే అహం బాలకృష్ణలో లేదని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారని చెప్పారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాలో తన పాత్ర సాఫ్ట్‌గా ఉంటుందన్నారు. ఈ రోల్‌తో ప్రేక్షకులకు మరింత చేరువవుతానని తెలిపారు. ఈ మూవీ ఈ నెల 12న రిలీజ్ కానుంది.

News January 9, 2025

రాష్ట్రంలో ఇక KF బీర్లు దొరకవా?

image

TG: ప్రభుత్వం రేట్లు పెంచడం లేదంటూ యునైటెడ్ బ్రూవరీస్(UB) సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. KF సహా 7 రకాల బీర్లు తయారుచేసే ఈ సంస్థకు సంబంధించి ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ ఉందని మంత్రి జూపల్లి తెలిపారు. కొన్నిరోజుల పాటు KF బీర్లు వైన్స్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అప్పటిలోపు ప్రభుత్వం, UB కంపెనీ మధ్య సయోధ్య కుదిరితే KF బీర్ల సరఫరాకు ఆటంకం ఉండదు. లేదంటే ఇకపై రాష్ట్రంలో ఆ రకం బీర్లు లభించవు.

News January 9, 2025

Breaking: 1978 సంభల్ అల్లర్ల కేసు రీఓపెన్

image

1978 సంభల్ అల్లర్లపై UP Govt కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా మూసేసిన కేసును 47 ఏళ్ల తర్వాత తెరుస్తోంది. వారంలోపు దర్యాప్తును ముగించి రిపోర్టు ఇవ్వాలని SPని ఆదేశించింది. UP MLC శ్రీచంద్ర శర్మ డిమాండుతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అల్లర్లకు పాల్పడింది ఎవరు? రాజకీయ ఒత్తిళ్లతో పేర్లు వెల్లడించని వ్యక్తులు ఎవరు? స్వస్థలాన్ని వదిలేసి వెళ్లిన వారెందరో గుర్తించడమే రీఓపెన్ ఉద్దేశంగా తెలుస్తోంది.