News December 3, 2024
లోక్‌సభలో ప్రియాంకా గాంధీ సీట్ నంబర్ ఇదే!

18వ లోక్‌సభలో ఎంపీలు కూర్చునే సీట్ల నంబర్లను ఫైనల్ చేశారు. ప్రధాని మోదీకి నంబర్ 1, రాజ్‌నాథ్ సింగ్‌కు 2, అమిత్ షాకు 3.. గడ్కరీకి 58 నుంచి 4వ సీటును కేటాయిస్తూ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 498వ సీట్, ఆయన పక్కన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూర్చోనున్నారు. ఇటీవల వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ప్రియాంకా గాంధీకి 4వ వరుసలోని 517వ నంబర్ సీటు కేటాయించారు.
Similar News
News January 4, 2026
లూఫాను శుభ్రం చేస్తున్నారా?

చర్మంపై ఉన్న మృతకణాల్ని తొలిగించి చర్మాన్ని మృదువుగా చేయడానికి రోజూ స్నానం చేసేటప్పుడు లూఫాను ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని సరిగా శుభ్రం చేయకుండా వాడితే బ్యాక్టీరియా చేరి చర్మం ఇరిటేట్ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లూఫాను ఉపయోగించాక పొడిగా ఉన్న ప్రాంతంలోనే పెట్టాలి. లేదంటే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు ఒక లూఫాను రెండు నెలలు కంటే ఎక్కువ వాడకూడదని సూచిస్తున్నారు.
News January 4, 2026
ఇతిహాసాలు క్విజ్ – 117 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి దగ్గర పాంచజన్యం అనే శంఖంతో పాటు అతి శక్తిమంతమైన విల్లు ఉంది. దాని పేరేంటి? ఎవరు తయారుచేశారు?
సమాధానం: కృష్ణుడు కురుక్షేత్రంలో ఆయుధం పట్టనని చెప్పినప్పటికీ, ఆయన దగ్గర ‘శారంగం’ అనే శక్తిమంతమైన విల్లు ఉంది. ఇది విశ్వకర్మ తయారుచేసిన దివ్యాయుధం. అర్జునుడి గాండీవమే గాక శారంగం కూడా తిరుగులేని ఆయుధంగా పేరుగాంచింది. కృష్ణుడి నందకం అనే ఖడ్గం కూడా ఉంటుంది. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 4, 2026
డబ్బు సేవ్ చేయకండి.. కియోసాకి సలహా

గతంలో ఉద్యోగం ఉంటే జీవితానికి భద్రత ఉండేదని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ‘ఇప్పుడు అన్ని పరిస్థితులు మారిపోయాయి. 2025లో పెద్ద టెక్ కంపెనీలే వేల కొద్దీ ఉద్యోగులను తొలగించాయి. అందుకే మీ ఫైనాన్షియల్ IQని పెంచుకోండి. ఎప్పుడూ డబ్బును సేవ్ చేయకండి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి వాటిని సేవ్ చేసుకోండి’ అని ట్వీట్ చేశారు.


