News May 25, 2024
శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనం: సీఈవో

AP: పల్నాడు జిల్లాలో పోలింగ్ నిర్వహణలో అధికారులు వైఫల్యం చెందారని వస్తున్న విమర్శల వేళ సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో 85.65 శాతం ఓటింగ్ నమోదవడం శక్తిమంతమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి నిదర్శనం’ అని రాసుకొచ్చారు. కవిసార్వభౌమ శ్రీనాథుడు, ఆధునిక కవిచక్రవర్తి జాషువా ఈ ప్రాంతానికి చెందినవారేనని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
NRPT: పోస్టల్ బ్యాలెట్ పై అధికారులకు శిక్షణ

పోస్టల్ బ్యాలెట్ శిక్షణను అధికారులు వినియోగించుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారుల పోస్టల్ బ్యాలెట్ వినియోగం, లెక్కింపు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
News December 2, 2025
దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.
News December 2, 2025
టికెట్ ధరల పెంపు.. నెటిజన్ల ఆగ్రహం!

APలో ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల <<18450771>>పెంపునకు<<>> ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు పెంచుకుని ఇలా ప్రేక్షకులపై భారం మోపడం కరెక్ట్ కాదని అంటున్నారు. రేట్లు పెంచితే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవి లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందంటున్నారు. దీనిపై మీ కామెంట్?


