News June 29, 2024

‘కల్కి’ మూవీపై పుష్పరాజ్ రియాక్షన్ ఇదే..

image

అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించారని కల్కి టీమ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారన్నారు. మూవీ కోసం కష్టపడ్డ సిబ్బందికి Xలో అభినందనలు తెలిపారు. భారత సినిమా స్థాయిని పెంచిన నిర్మాత అశ్వనీదత్‌కు ప్రశంసలు దక్కుతాయన్నారు. తమ తరం దర్శకుడు నాగ్ అశ్విన్ తన టేకింగ్‌తో ప్రతి ప్రేక్షకుడిని ఆశ్చర్యపోయేలా చేశారన్నారు.

Similar News

News September 20, 2024

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం

image

TG: హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

News September 20, 2024

ఇది ముంచిన ప్రభుత్వం: అంబటి

image

AP: కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు.

News September 20, 2024

తిరుమ‌ల ప్ర‌సాదం క‌ల్తీ వివాదం.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

image

తిరుమ‌ల‌ ప్ర‌సాదం కల్తీ వివాదం నేపథ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజ‌ల‌కు, దీపాలకు, అన్న ప్ర‌సాదాల‌కు నందిని నెయ్యి మాత్ర‌మే వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామ‌లింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.