News June 18, 2024
ఇది సర్.. ధోనీ రేంజ్!
భారత క్రికెట్ దిగ్గజం ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న FIFA ఇన్‌స్టాలో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫొటోను షేర్ చేస్తూ ‘తలా ఫర్ ఏ రీజన్ 7’ అని రాసుకొచ్చింది. ధోనీని అభిమానులు ‘తలా’ అని పిలుస్తారని తెలిసిందే. కాగా ఏకంగా FIFA అలా పోస్టు చేయడంతో ‘ధోనీ రేంజ్ ఇది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 6, 2025
పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డోర్ క్లోజ్: మంత్రి పొంగులేటి
TG: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డోర్ క్లోజ్ అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పాలనలో పింక్ షర్ట్ వేసుకున్నవారికే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదని దుయ్యబట్టారు. అప్పుడంటే కాలు విరిగింది, ఇప్పుడేమైందని ప్రశ్నించారు.
News January 6, 2025
రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చాం: నాదెండ్ల
AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటికి 4.15 లక్షల మంది రైతుల నుంచి 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్నదాతల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఖరీఫ్‌లో 2.12 లక్షల మంది నుంచే ధాన్యం తీసుకుందని విమర్శించారు. తమ ప్రభుత్వం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని, ఇప్పటి వరకు రూ.6,083 కోట్లు చెల్లించిందని తెలిపారు.
News January 6, 2025
నటికి వేధింపులు.. 30 మందిపై కేసు
సోషల్ మీడియాలో కొందరు తనను <<15073430>>వేధింపులకు గురిచేస్తున్నారని<<>> హీరోయిన్ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఓ బిజినెస్‌మన్ తనను వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో ఆమె ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించారు. వారి కామెంట్లు మానసిక వేధింపులకు కారణమయ్యాయని ఆమె పేర్కొన్నారు.