News March 18, 2024
‘కీడా కోలా’లో ఎస్పీ బాలు పాటపై తరుణ్ భాస్కర్ రియాక్షన్ ఇదే..

‘కీడా కోలా’ మూవీలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. బాలు కుమారుడు చరణ్ లీగల్ నోటీసులు పంపింది నిజమేనా? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. ఇద్దరివైపు నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందని ఆయన చెప్పారు. గొప్ప కళాకారులను అమర్యాద పరచాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదని.. ప్రస్తుతం అంతా సర్దుకుందని బదులిచ్చారు.
Similar News
News November 11, 2025
ఇంటి బేస్మెంట్ రోడ్డు కంటే ఎంత ఎత్తు ఉండాలి?

ఇంటి బేస్మెంట్ ఎత్తు గురించి వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ముఖ్యమైన సలహాలిచ్చారు. ‘ఇంటి బేస్మెంట్ తప్పనిసరిగా రహదారి ఎత్తు కంటే కనీసం 3 ఫీట్ ఎత్తులో ఉండాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు ఇంట్లోకి వస్తుంది. రహదారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, కాలుష్యం నేరుగా ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ నియమం పాటించాలి. ఇంటికి ఆధారం, గౌరవం పెరగడానికి, లోపల శుద్ధి ఉండడానికి ఈ ఎత్తు ఉత్తమం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 11, 2025
22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు: మంత్రి సత్యకుమార్

APలో 39L మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 22,861మందిలో సర్వైకల్, 9,963మందిలో బ్రెస్ట్, 26,639మందిలో నోటి క్యాన్సర్ లక్షణాలను గుర్తించామన్నారు. వీరిని బోధనాస్పత్రుల్లోని ఆంకాలజిస్టులు మరోసారి పరీక్షించి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందిస్తారని చెప్పారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మళ్లీ స్క్రీనింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.


