News July 24, 2024

‘ఇది ట్యాక్స్ టెర్రరిజం’.. పన్ను విధానంపై నెట్టింట విమర్శలు

image

పన్ను చెల్లింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను పెంచడం, ప్రాపర్టీలపై ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తొలగించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ‘TaxTerrorism’ హ్యాష్‌ట్యాగ్‌తో Xలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం పెరిగినా, మదుపు చేసినా, ఖర్చు చేసినా ట్యాక్స్ బాదుడు తప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

image

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్‌కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

News September 16, 2025

ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

image

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్‌ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్‌ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

News September 16, 2025

రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

image

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.