News November 27, 2024
అఖిల్కు కాబోయే మామ బ్యాక్గ్రౌండ్ ఇదే..!

అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య తండ్రి జుల్ఫీ రవ్డ్జీ గత జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా పని చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో ఉండేవారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేసే జుల్ఫీ కుమారుడు జైన్ ప్రస్తుతం ZR Renewable Energy Pvt Ltd. ఛైర్మన్, ఎండీగా ఉన్నారు.
Similar News
News January 4, 2026
రెయిన్బో బేబీ అంటే ఏంటో తెలుసా?

వివిధ కారణాల వల్ల కొందరు పేరెంట్స్ ముందు బిడ్డను/బిడ్డలను కోల్పోతారు. ఆ తర్వాత పుట్టేవారిని రెయిన్బో బేబీ అంటారు. వైద్యులు ఈ రెయిన్బో బేబీస్ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరిని కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావచ్చు. ఇంద్రధనస్సు అనేది వర్షం తర్వాత కనిపించే అందమైన రంగుల సమ్మేళనం. అలాగే ఈ బేబీస్ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తారు. అందుకే వారిని రెయిన్బో బేబీస్ అంటారు.
News January 4, 2026
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం

లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని DGCA నిషేధించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమానాల్లో మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని తాజా సర్క్యులర్లో పేర్కొంది. ముఖ్యంగా వీటిని ఓవర్హెడ్ బిన్లలో ఉంచినప్పుడు పొగ లేదా మంటలను గుర్తించడం కష్టమవుతుందని, ఇది విమాన భద్రతకు పెను ప్రమాదమని హెచ్చరించింది.
News January 4, 2026
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం MAR 3న మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేసింది. ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని, భక్తులు గమనించాలని TTD కోరింది.


