News March 17, 2024

అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక నేపథ్యం ఇదీ..

image

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2 పర్యాయాలు మలికిపురం మండలం చింతలమోరి సర్పంచిగా, ఒకసారి పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేసిన రాపాక 2009, 2019 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రాపాకను నియమించగా బరిలో ఉన్నారు.

Similar News

News December 27, 2025

29న యథావిధిగా ‘పీజీఆర్‌ఎస్’: కలెక్టర్

image

డిసెంబర్ 29న కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ‘ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్’ (PGRS) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వినతులను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News December 27, 2025

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహ బేగ్ బాధ్యతలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొవ్వూరు మండలం కాపవరానికి చెందిన అమర్జహ బేగ్ నియమితులయ్యారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న అమర్జహ బేగ్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

News December 27, 2025

తూ.గో: యువత రీల్స్ పిచ్చి.. మృత్యువుకు ఆహ్వానం!

image

గోపాలపురం జాతీయ రహదారి16 మృత్యుదారిగా మారుతోంది. గుండుగొలను-కొవ్వూరు మధ్య సోషల్ మీడియా పిచ్చితో యువత చేస్తున్న విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అపసవ్య దిశలో, అతివేగంతో ప్రయాణిస్తూ యువకులు దుర్మరణం చెందుతున్నారు. కాగా, ఈరోజు ఇదేరోడ్డుపై ముగ్గురు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.