News October 9, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేపథ్యం ఇదే

TG: నవీన్ యాదవ్ 1983లో జన్మించారు. తండ్రి పేరు చిన శ్రీశైలం యాదవ్. నవీన్ 2014లో MIM, 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి అజాహరుద్దీన్‌కు మద్దతు ప్రకటించారు. నవ యువ ఫౌండేషన్ స్థాపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ, సామూహిక వివాహాలు, జాబ్ మేళాలు వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానికంగా ఈయనకు మంచి పట్టు ఉంది.
Similar News
News October 9, 2025
లక్షల కోట్లు బూడిద చేశాడు

US కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ పాలిసేడ్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఉద్దేశపూర్వకంగా సృష్టించిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో 29 ఏళ్ల జొనాథన్ రిండర్‌నెక్ట్‌ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 1న అతను పెట్టిన మంట లాస్ ఏంజెలిస్ చరిత్రలోనే భారీ అగ్నిప్రమాదంగా మారింది. ఈ మంటలకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, 6,800 కట్టడాలు బూడిదయ్యాయి. దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
News October 9, 2025
వచ్చే డీఎస్సీలో 1,803 పీఈటీ, 261 HM పోస్టుల భర్తీ!

TG: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు పీఈటీ ఉండాలన్న CM రేవంత్ ఆదేశాలతో అధికారులు చర్యలకు దిగారు. మొత్తం 4,641 హైస్కూళ్లలో 2,800కు పైగా పాఠశాలల్లో పీఈటీలు ఉన్నారు. దీంతో కొత్తగా 1,803 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అటు కొత్త స్కూళ్లలో 261 హెడ్‌మాస్టర్ పోస్టులు భర్తీకి ప్రపోజల్ చేశారు. వీటిని వచ్చే DSCలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
News October 9, 2025
190 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ Eng), CA/CMA, CFMA/MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/