News October 14, 2025
మల్లోజుల వేణుగోపాల్ నేపథ్యమిదే!

<<18001632>>మల్లోజుల వేణుగోపాల్<<>> అలియాస్ సోనూ దివంగత మావోయిస్టు కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడు. ఇతని స్వస్థలం TGలోని పెద్దపల్లి. బీకాం చదివిన ఈయన గడ్చిరోలి, ఏపీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2011 NOVలో బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ చనిపోగా, ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తార లొంగిపోయారు. 69ఏళ్ల వయసున్న వేణుగోపాల్ మునుపటిలా యాక్టివ్‌గా లేరని సమాచారం.
Similar News
News October 14, 2025
ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2025
మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.
News October 14, 2025
ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్: లోకేశ్

విశాఖలో గూగుల్ <<18002028>>పెట్టుబడుల ఒప్పందం<<>> తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.