News February 11, 2025
రంగరాజన్‌పై దాడిచేసిన వీరరాఘవ రెడ్డి నేపథ్యమిదే..

చిలుకూరు బాలాజీ అర్చకుడు <<15409945>>రంగరాజన్‌పై దాడిచేసిన<<>> వ్యక్తి వివరాలు బయటకొచ్చాయి. తూ.గో. జిల్లా కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించి తాము ఇక్ష్వాకుల వంశస్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఆలయాలు తిరుగుతూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇతడు చట్టాలపై మంచి పట్టు తెచ్చుకున్నారు. 2015లో తన కూతురి అడ్మిషన్ విషయంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై కేసు వేసి గెలిచారు.
Similar News
News April 4, 2026
టాస్ గెలిచిన ఢిల్లీ.. ముంబైకి హార్దిక్ దూరం

ఢిల్లీ వేదికగా కాసేపట్లో MI, DC తలపడనున్నాయి. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు MI కెప్టెన్ హార్దిక్ దూరమయ్యారు. దీంతో సూర్య కెప్టెన్సీ చేస్తున్నారు. టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ బౌలింగ్ ఎంచుకొన్నారు.
MI: రోహిత్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్, రూథర్‌ఫోర్డ్, శాంట్నర్, బాష్, శార్దూల్, దీపక్, బుమ్రా
DC: రాహుల్, నిస్సాంక, నితీశ్ రాణా, నిగమ్, అక్షర్, మిల్లర్, స్టబ్స్, కుల్దీప్, ఎంగిడి, నటరాజన్, ముకేశ్
News April 4, 2026
సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్

ప్రపంచ దేశాలతోపాటు అంతర్గతంగా ఎదురైన ఎన్నో సవాళ్లను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. IIM రాయ్‌పూర్ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ‘మన సామర్థ్యాన్ని పరీక్షించిన ఎన్నో షాక్‌ల నుంచి బయటపడ్డాం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, పెరుగుతున్న పోటీతత్వం కారణంగా మన కెపాసిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు.
News April 4, 2026
ఏపీ కొత్త మ్యాప్ విడుదల

అమరావతి రాజధానిగా 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి.


