News September 9, 2025

నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నేపథ్యం

image

C.P.రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్‌లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP నుంచి MPగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్‌ అయ్యారు. 2024లో TG గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్‌గా పని చేశారు.

Similar News

News March 5, 2026

వారంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్?

image

టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో పెళ్లి పీఠలెక్కనున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ ఈ వారంలోనే జరుగుతుందని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వధువు వివరాలు, వివాహ తేదీ, వేదిక వివరాలను ప్రకటిస్తారని టాక్. కాగా విజయ్ దేవరకొండ-రష్మిక FEB 26న పెళ్లాడగా, రేపు(MAR 6) అల్లు శిరీష్-నయనిక వివాహం జరగనుంది.

News March 5, 2026

ఇంగ్లండ్ దూకుడు.. భారత్ గెలుస్తుందా?

image

T20 WC సెమీస్-2లో ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. భారత్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిక్సర్లతో విరుచుకుపడుతోంది. వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయినా జాకబ్ బెథెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 28 బంతుల్లోనే 65* పరుగులు చేశారు. విల్ జాక్స్ 19 బంతుల్లోనే 35* రన్స్ కొట్టారు. ఇంకా 42 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి ఉంది. 13 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 160-4.

News March 5, 2026

భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.