News September 8, 2024
రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..

AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.
Similar News
News December 19, 2025
నిత్య పూజ ఎలా చేయాలి?

నిత్య పూజ భగవంతుని పట్ల భక్తిని చాటుకునే ప్రక్రియ. దీనిని షోడశోపచార/పంచోపచార పద్ధతుల్లో చేయవచ్చు. స్నానం చేశాక శుభ్రమైన వస్త్రాలు ధరించి, దీపారాధనతో పూజ ప్రారంభించాలి. ముందుగా గణపతిని, ఆపై కులదైవాన్ని ధ్యానిస్తూ ఆవాహన, ఆసనం, స్నానం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఆఖరున హారతి ఇచ్చి, ఆత్మప్రదక్షిణ చేసి నమస్కరించుకోవాలి. పూజలో సామాగ్రి కంటే శుద్ధమైన మనస్సు, ఏకాగ్రత, భక్తి ముఖ్యం.
News December 19, 2025
మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు భారత్

అబుదాబీలో భారీ వర్షం కారణంగా భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆసియా కప్ U-19 సెమీఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. కాసేపట్లో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్ చేరనుంది. మరో సెమీస్‌లో బంగ్లా, పాక్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది.
News December 19, 2025
‘వీబీ-జీ రామ్ జీ’తో కనీస వేతనాలకు ముప్పు!

MGNREGA పేరును ‘వీబీ-జీ రామ్ జీ’గా మార్చిన కేంద్రం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. అయితే ఈ పథకం వల్ల ప్రైవేటు వ్యక్తులు కూలీలకు అంతకన్నా మెరుగైన వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్లో పథకం నిలిపివేస్తే ప్రైవేటు మోనోపలీ పెరిగి కనీస వేతనాలు దక్కవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రబీ, ఖరీఫ్ వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తీరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.


