News October 27, 2024
దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే!

ఇండియాలో 2024కి గాను అత్యుత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ SBIని బెస్ట్ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలు, ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఎస్బీఐ ముందంజలో ఉందని ఆ మ్యాగజైన్ తెలిపింది. మన దేశంలో SBIకి 22500 బ్రాంచులు, 62వేల ఏటీఎంలు ఉన్నాయి.
Similar News
News January 6, 2026
GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.
News January 6, 2026
31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.
News January 6, 2026
కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.


