News March 22, 2024
‘ఫాక్స్ క్రికెట్’ బెస్ట్ IPL టీమ్ ఇదే

ఆస్ట్రేలియాకు చెందిన టెలివిజన్ ఛానెల్ ‘ఫాక్స్ క్రికెట్’ ఆల్ టైమ్ బెస్ట్ ఐపీఎల్ టీంను ప్రకటించింది. ఆ జట్టుకు ధోనీని సారథిగా ఎంచుకుంది.
టీం: రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, డివిలియర్స్, ధోనీ (C), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, చాహల్, మలింగ, బుమ్రా.
* టీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News September 14, 2025
మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.
News September 14, 2025
NTR స్మృతివనంలో విగ్రహం ఏర్పాటుపై సమీక్ష

AP: అమరావతిలోని నీరుకొండ వద్ద నిర్మించే NTR స్మృతివనం తెలుగువారి ఆత్మగౌరవం-ఆత్మవిశ్వాసం కలగలిపి వైభవంగా ఉండాలని CM చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టులో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, ప్రాచీన చరిత్రకు పెద్దపీట వేయాలన్నారు. NTR విగ్రహం ఏర్పాటుపై సమీక్షించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 14, 2025
సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: HYD మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1984: బాలీవుడ్ హీరో ఆయుష్‌మాన్ ఖురానా జననం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
*హిందీ భాషా దినోత్సవం