News May 20, 2024

2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా

image

లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసిన గిరిజనుడి ఫొటోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదేనంటూ కొనియాడారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎదురులేదని, తిరుగులేని శక్తి అని మహీంద్రా కొనియాడారు.

Similar News

News January 8, 2025

మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

TG: కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. గత ఐదేళ్లుగా బీర్ల ధరల పెంపునకు TGBCL అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతటి భారీ నష్టాల్లో తాము బీర్లను సరఫరా చేయలేమని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఈ బీర్లు దొరకకపోవడంతో కొన్నేళ్లుగా మందుబాబులు జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేశారు.

News January 8, 2025

పరీక్షల తొలగింపుపై నిర్ణయం జరగలేదు: BIE

image

ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్షల తొలగింపుపై తుది నిర్ణయం జరగలేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. కొత్త ప్రతిపాదనలపై ప్రస్తుతం సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.

News January 8, 2025

AAG ఏం చెబుతారు..?

image

TG: ACB విచారణకు లాయర్‌ను అనుమతించాలన్న <<15097073>>KTR<<>> పిటిషన్‌పై ఈ సాయంత్రం హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఇలాంటి దర్యాప్తును న్యాయవాది చూసే అవకాశం ఉందా? అని ACB తరఫు లాయర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. సాయంత్రం గం.4లోపు చెబుతామని దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన AAG కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు తిరిగి ప్రారంభమయ్యే విచారణలో ప్రభుత్వ కౌన్సిల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.