News December 5, 2024

నవంబరులో బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే

image

భారత మార్కెట్‌లో గత కొంతకాలంగా SUV మోడల్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అయితే ఆ ట్రెండ్‌ను మారుతీ సుజుకీ బలెనో గత నెలలో బ్రేక్ చేసింది. క్రెటా, నెక్సాన్, బ్రెజా, స్కార్పియో వంటివాటన్నింటినీ తోసిరాజని అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది నవంబరులో 16,293 బలెనో యూనిట్లను మారుతి విక్రయించింది. తర్వాతి స్థానాల్లో క్రెటా(15,452) టాటా పంచ్(15,435), టాటా నెక్సాన్(15,329) ఉన్నాయి.

Similar News

News March 25, 2026

మీలాంటి వారితో ఎప్పటికీ చర్చలు జరపం: IRGC

image

ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని US అధ్యక్షుడు ట్రంప్, US మీడియా చెబుతుంటే ఇరాన్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ట్రంప్ వంటి వ్యక్తులతో ఇరాన్ ఎన్నటికీ చర్చలు జరపదని IRGC స్పష్టం చేసింది. ఓటమిని ఒప్పందం పేరుతో కప్పిపుచ్చుకోవద్దని.. మీలో మీరే చర్చించుకునే స్థాయికి అంతర్గత కలహాలు చేరాయని ఎద్దేవా చేసింది. తమ సైన్యంతోనే ఇక్కడ స్థిరత్వం ఏర్పడుతుందని US గ్రహించే వరకు ఆయిల్ ధరలు తగ్గవంది.

News March 25, 2026

టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

image

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌తో రేవంత్ ముచ్చటించారు.