News January 1, 2025
దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ ఇదే
JSW MG Windsor EV రికార్డులు తిరగరాస్తోంది. వరుసగా మూడో నెలా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. SEPలో 3116, OCTలో 3144, DECలో 3785 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రూ.13.50L-15.50L లభిస్తున్న ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332km నడుస్తుంది. Tata Tiago.ev, Tata Punch.ev, Tata Nexon.ev, Tata Curvv.ev, Mahindra XUV400, Citroen E-C3 వంటి బడ్జెట్ కార్లు దీనికి పోటీనివ్వలేకపోతున్నాయి.
Similar News
News January 4, 2025
5 ఎకరాల్లోపే రైతుభరోసా ఇవ్వాలని వినతి
TG: రైతుభరోసా పథకాన్ని 5 ఎకరాలలోపు రైతులకే అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు, వందల ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, IT చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కోసం రేపటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, జనవరి 14న నగదు జమ చేయనుంది.
News January 4, 2025
సినీ నటి సీత తల్లి కన్నుమూత
సీనియర్ నటి సీత తల్లి చంద్రమోహన్ (88) కన్నుమూశారు. చెన్నైలోని సాలిగ్రామంలోని తన స్వగృహంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు చంద్రావతి కాగా, పెళ్లయ్యాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు, తమిళ సినిమాలతో పాటు సీరియళ్లలో నటిస్తూ పాపులర్ అయ్యారు.
News January 4, 2025
శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
భారత భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1975, 1998 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా పనిచేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.