News March 23, 2024
20 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి

రష్యాలోని ఓ షాపింగ్ మాల్లో ఉగ్రవాదుల నరమేధంతో 62 మంది పౌరులు <<12907109>>మరణించడం<<>> సంచలనంగా మారింది. మాస్కోలో 2002 తర్వాత ఇదే అతిపెద్ద దాడి. 1999లో ఓ భవనంపై టెర్రరిస్టులు దాడి చేయడంతో ఒకే రోజు 118 మంది మరణించారు. రెండు వారాలపాటు సాగిన కాల్పుల్లో మొత్తం 293 మంది చనిపోయారు. 2002లో ఓ థియేటర్లో దాడి జరగగా 130 మంది దుర్మరణం పాలయ్యారు. 2003లో 15, 2004లో 41, 2010లో 40, 2011లో 37 మంది చనిపోయారు.
Similar News
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.
News November 22, 2025
దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.
News November 22, 2025
‘యాషెస్’ను అసూయతో చూశా: సౌతాఫ్రికా కెప్టెన్

5 టెస్టుల యాషెస్ సిరీస్ను చూస్తే అసూయగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నారు. ఇండియాతో టెస్టు సిరీస్ 2 మ్యాచులకే పరిమితం చేయడంపై ఇలా అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘యాషెస్ను చూడటానికి ఉదయాన్నే మేం లేచాం. వాళ్లు 5 టెస్టులు ఆడుతున్నారని తెలిసి అసూయతో చూశాం’ అని చెప్పారు. త్వరలో పరిస్థితి మారుతుందని అనుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో భారత్తో 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు వస్తామని పేర్కొన్నారు.


