News October 24, 2024

డాలర్‌కు చెక్ పెట్టే BRICS కరెన్సీ నోటు ఇదే!

image

BRICS అధికారిక కరెన్సీ నమూనా నోట్లు విడుదలయ్యాయి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వీటిని అందరికీ చూపించారు. ‘BRICS bill’గా పిలుస్తున్న నోటు ముందు వైపున భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికా జాతీయ పతాకాలు ప్రింట్ చేశారు. వాటిపై తాజ్‌మహల్, డ్రాగన్ వంటి చిహ్నాలకు చోటిచ్చారు. వెనుకవైపు కొత్త సభ్యదేశాల పేర్లు, జెండాలు ఉన్నాయి. ఇవి డాలర్ డామినేషన్‌కు చెక్ పెడతాయని విశ్లేషకుల అంచనా. మీ comment.

Similar News

News November 17, 2025

గంజాయి టెస్ట్.. స్పాట్‌లోనే రిజల్ట్స్!

image

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్‌’తో టెస్ట్ చేసి స్పాట్‌లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

రేపు భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.