News March 16, 2024
అభ్యర్థుల బడ్జెట్ ఇదే

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పార్లమెంట్ అభ్యర్థులు రూ.90 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చని తెలిపింది. అసెంబ్లీకి పోటీ చేసే వారు రూ.38 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఖర్చుల వివరాలు ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
Similar News
News April 15, 2025
కారు డోర్ లాకింగ్ మర్చిపోకండి!

TG: మీరు ఏ పనిలో ఉన్నా పిల్లల్ని ఓ కంట గమనిస్తూనే ఉండాలనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) కారులో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మేనమామకు పెళ్లి కుదిరిందని వెళ్లిన పిల్లలు కారులో ఆడుకోవడానికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడూ కారును లాక్ చేసి ఉంచండి. ముఖ్యంగా చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఇది మర్చిపోవద్దు.
News April 15, 2025
TCSలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు!

ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.
News April 15, 2025
ఈనెల 22న టెన్త్ ఫలితాలు విడుదల?

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇటీవల ఇంటర్ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.