News October 7, 2025
అమెనోరియా సమస్యకు కారణమిదే!

నెలసరి సమయానికి రాకపోవడాన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభంలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె, బోలు ఎముకల వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
✍️ ప్రతిరోజూ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.
Similar News
News October 7, 2025
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో

దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆక్యుఫెన్సీ రేషియోలో రాష్ట్రంలో మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో నిలిచిందని మేనేజర్ రమేశ్ బాబు తెలిపారు. డిపోలో సోమవారం రాత్రి నిర్వహించిన సంబరాలల్లో ఆయన పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, కృష్ణయ్య,దీప్లాల్, పాపరాజు, సమాద్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 7, 2025
నేడు చంద్రబాబుతో TTDP నేతల భేటీ

తెలంగాణ టీడీపీ నేతలకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయంత్రం టీటీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. అటు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ ఉంటుందా? లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
News October 7, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో 20 ఉద్యోగాలు

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.prl.res.in/