News February 14, 2025
పెన్షన్లు తెచ్చిన సీఎం ఈయనే

దామోదరం సంజీవయ్య 1960-62 వరకు CMగా ఉన్నారు. ఈయనది కర్నూలు జిల్లా పెద్దపాడు. అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గవర్నమెంట్ టీచర్లకు, వృద్ధులకు పెన్షన్ తీసుకొచ్చారు. కాపు కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.
*ఇవాళ ఆయన జయంతి
Similar News
News November 23, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం

డా. బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యయన కేంద్రంలో ఆదివారం డిగ్రీ 1, 3, 5 వ సెమిస్టర్, పి.జీ. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. అధ్యయన కేంద్రం వసతులు, నియమ నిబంధనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర – ఆర్డినేటర్ డా. కె. రంజిత, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.
News November 23, 2025
భారీ జీతంతో 115 ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA ఉత్తీర్ణత, వయసు 22-45 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు.
వెబ్సైట్: https://bankofindia.bank.in/
News November 23, 2025
మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఖాతా ఉందా?

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.


