News July 17, 2024

ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది: అమర్నాథ్

image

AP: విశాఖలోని ఎర్రమట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ Xలో ఆరోపించారు. ‘ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నేతల మద్దతుతో తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 35రోజుల్లో ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది’ అంటూ సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై <<13647350>>విచారణ<<>>కు ఆదేశించింది.

Similar News

News March 26, 2026

నేపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.187

image

యుద్ధ ప్రభావంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

News March 26, 2026

ధురంధర్-2పై ఏఐ వీడియోలు.. డైరెక్టర్ వార్నింగ్

image

ధురంధర్-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు డైరెక్టర్ ఆదిత్య ధర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు చిత్రంలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. రెచ్చగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని SMలో హెచ్చరించారు.

News March 26, 2026

నేటి నుంచి భానుడి భగభగలు

image

TG: నేటి నుంచి భానుడు భగ్గుమంటాడని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 39-41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో వికారాబాద్, సంగారెడ్డి, RR, నారాయణపేట్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.