News November 30, 2024

జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే!

image

ప్రపంచంలో అత్యధికంగా అమెరికా జైలులో 18,08,100 మంది ఖైదీలున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (16,90,000), బ్రెజిల్ (8,50,377) ఉండగా ఫోర్త్ ప్లేస్‌లో ఇండియా(5,73,220) ఉంది. ఆ తర్వాత రష్యా (4,33,006), టర్కీ (3,62,422), థాయిలాండ్ (2,74,277), ఇండోనేషియా (2,73,541), మెక్సికో (2,33,687) ఉన్నాయి. కాగా, పాకిస్థాన్ జైలులో 87,712 మంది ఖైదీలే ఉన్నారు.

Similar News

News November 16, 2025

డ్రైవర్ అన్నలూ.. ప్రాణాలు తీయకండి!

image

రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం, ఇతర పనుల వల్ల కొందరు డ్రైవర్లు రోడ్డు పక్కనే బండ్లు ఆపుతారు. కనీసం సిగ్నల్ లైట్లు వేయరు. రేడియం రిఫ్లెక్టర్లు ఉండవు. దీనివల్ల రాత్రి వేళల్లో వెనుక నుంచి వస్తున్న వాహనాలకు అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలికాలంలో పొగమంచు వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
Share it

News November 16, 2025

RRBలో JE ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

RRB జూనియర్ ఇంజినీర్(JE) పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా.. DEC 10 వరకు పొడిగించింది. 2,569 పోస్టులకు గాను చెన్నై, జమ్మూ, శ్రీనగర్ రీజియన్‌లో 16 పోస్టులు పెంచడంతో 2,585కు చేరాయి. ఇప్పటికే అప్లై చేసుకున్నవారు పోస్టు ప్రాధాన్యత , రైల్వేజోన్ సవరణ ఎలాంటి ఫీజు లేకుండా NOV25 – DEC 10 వరకు చేసుకోవచ్చు.

News November 16, 2025

పొదచిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

image

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.