News September 14, 2024
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ప్రస్తుత పరిస్థితి ఇది!

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన 21మందిలో 20మందికి బెయిల్ వచ్చింది. బిజినెస్‌మ్యాన్ అమన్‌దీప్‌కు మాత్రం లభించలేదు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, కవిత, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ, సత్యేంద్ర, విజయ్ నాయర్, శరత్‌రెడ్డి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, రాజేశ్ జోషి, అరుణ్ పిళ్లై, అర్వింద్ కుమార్, బెనోయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, చన్‌ప్రీత్, దినేశ్, వినోద్‌కు బెయిల్ వచ్చింది.
Similar News
News November 7, 2025
రైనా, ధవన్.. వీళ్లేం సెలబ్రిటీలు?: సజ్జనార్

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.
News November 7, 2025
వంటింటి చిట్కాలు

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.


