News May 24, 2024

SRHకు ‘ఛార్జింగ్’ వచ్చిన రోజు ఇదే..

image

IPL టైటిల్‌ను డెక్కన్ ఛార్జర్స్ గెలుచుకుని 15ఏళ్లు పూర్తయ్యింది. 2009 మే 24న జరిగిన ఫైనల్‌లో తొలుత 143/6 స్కోర్ చేసిన DC.. RCBని 137/9కే కట్టడి చేసింది. కాలక్రమంలో డెక్కన్ ఛార్జర్స్ యాజమాన్యం చేతులు మారి SRHగా రూపాంతరం చెందినా, 2016లో టైటిల్ గెలిచినా 2009లో సాధించిన విజయం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇవాళ RRతో జరిగే Q2 మ్యాచ్‌లోనూ గెలిచి టైటిల్ పోరులో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
#ALL THE BEST SRH

Similar News

News November 20, 2025

తిరుపతి: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించారు. ఈ మేరకు SVU కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫీజు తుది గడువు 18వ తేదీతో ముగియగా.. ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.

News November 20, 2025

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

image

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.

News November 20, 2025

BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్‌టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్‌వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.