News April 16, 2024
మేం చేసిన అభివృద్ధి ఇదే: సీఎం జగన్

AP: తాము 58 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. ‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశాం. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 11 వేల ఆర్బీకేలు, 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించాం. నాడు నేడుతో స్కూళ్లు, హాస్పిటళ్ల రూపురేఖలు మార్చాం’ అని తెలిపారు.
Similar News
News January 25, 2026
తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ పగ్గాలు

రాష్ట్రీయ జనతాదళ్(RJD) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ డిప్యూటీ సీఎంగా అనుభవం ఉన్న తేజస్వి ఇకపై పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. సైట్: https://recruit.cusat.ac.in
News January 25, 2026
వంటింటి చిట్కాలు

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* క్యాలీఫ్లవర్ ఉడికించేప్పుడు కాసిని పాలు పోస్తే కూర రంగు మారదు.


