News January 21, 2025
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ఎటాక్ మధ్య తేడా ఇదే!

చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపుతుంది. అప్పుడు CPR చేయాలి. మెదడుకు రక్తాన్ని పంప్ చేయకపోవడంతో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అవుతాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేయాలి. చికిత్స చేయకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది.
Similar News
News November 22, 2025
SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.
News November 22, 2025
దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.


