News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
Similar News
News April 23, 2025
భయం భయం.. జమ్మూను వీడుతున్న పర్యాటకులు

పహల్‌గామ్ ఘటనతో జమ్మూకశ్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న టూరిస్టులు వారి నివాస స్థలాలకు పయనమవుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో నిండిపోయింది. రద్దీ దృష్ట్యా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. కాగా రహదారిపై కొండచరియలు పడటంతో తాత్కాలికంగా దానిని మూసివేశారు. దీంతో రైలు లేదా విమాన మార్గాల్లో వెళ్లాల్సి వస్తుంది.
News April 23, 2025
జమ్మూకశ్మీర్‌లో HIGH ALERT

ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను పెంచారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
News April 23, 2025
ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా ఉరి నాలా వద్ద నియంత్రణ రేఖ నుంచి ఇద్దరు, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారి చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ అడ్డుకుంది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భారీగా కాల్పులు జరుగుతున్నాయి.