News December 5, 2024
ప్రపంచంలో ఇదే మొదటి సారి..!

ఇస్రో ప్రవేశపెట్టిన ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆకలర్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి మొత్తం బరువు 550 KGలు. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టి కృత్రిమ గ్రహణాన్ని సృష్టించనున్నారు. దీంతో సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేస్తారు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే మొదటి సారి. ఇందులో 13 ఐరోపా దేశాలు, కెనడా భాగమయ్యాయి.
Similar News
News September 17, 2025
మహిళల ఆరోగ్యం కోసం కొత్త కార్యక్రమం

నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్రం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ పేరిట హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు పలు వైద్య పరీక్షలు చేస్తారు. PHC మొదలు బోధనా ఆస్పత్రుల వరకు 15 రోజులపాటు ఈ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్లో ప్రారంభించనున్నారు.
News September 17, 2025
రాష్ట్రవ్యాప్తంగా IT అధికారుల సోదాలు

TG: హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
News September 17, 2025
రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.