News February 25, 2025

ఇలాంటి వ్యక్తిని తొలిసారి చూస్తున్నా: సీఎం చంద్రబాబు

image

AP: ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తొలి సారి చూస్తున్నా. నిన్న 11 మంది వైసీపీ సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారు. వారికి సభను గౌరవించే సంస్కారం లేదు. అసెంబ్లీలో నిన్న చీకటి రోజు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News September 18, 2025

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి తదితర జిలాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.

News September 18, 2025

ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్

image

AP: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి ప్రభుత్వానికి లేదని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు టైం ఉంటుంది. ఆ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. సభ్యులకు కూడా రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం’ అని అన్నారు.

News September 18, 2025

హిండెన్‌బర్గ్ కేసు.. అదానీకి సెబీ క్లీన్‌చిట్

image

అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఛైర్మన్ గౌతమ్ అదానీపై షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల కేసును కొట్టేసింది. కాగా అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లను మ్యానిపులేట్ చేస్తూ డొల్ల కంపెనీలతో నిధులను సమీకరిస్తోందని 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఇది భారత మార్కెట్లను కుదిపేసింది. దీంతో సెబీ రంగంలోకి దిగింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తాజాగా వెల్లడించింది.