News May 10, 2024
ఇది జనసేన గొప్పతనం: పవన్ కళ్యాణ్

AP దశా, దిశా మార్చేందుకే తాను పిఠాపురం వచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పిఠాపురం సభలో మాట్లాడిన పవన్.. ‘దేశం గర్వంగా చెప్పుకునేలా పిఠాపురంలో మార్పు తీసుకొచ్చి చూపిస్తా. ఒక్క MLA, డబ్బు లేకున్నా మనలా పోరాడిన పార్టీ ఈ దేశంలోనే లేదు. 151 మంది MLAలున్న వైసీపీని పక్కన పెట్టారు. జనసేన పార్టీ కండువాను BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మెడలో వేసుకున్నారు. అది జనసేన గొప్పతనం’ అని పవన్ వ్యాఖ్యానించారు.
Similar News
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.
News November 21, 2025
90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో కిస్ సీన్!

ఇండియన్ సినిమాలో ముద్దు సీన్లు ఇప్పుడు కామన్. కానీ 90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో ముద్దు సీన్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? 1933లో వచ్చిన ‘కర్మ’ చిత్రంలో నటీనటులు దేవికా రాణి, హిమాన్షు రాయ్ (నిజ జీవితంలో భార్యాభర్తలు) సుదీర్ఘమైన తొలి ముద్దు సీన్లో నటించారు. దాదాపు 4 నిమిషాల పాటు సాగిన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిందని సినీవర్గాలు చెబుతున్నాయి.
News November 21, 2025
ఆక్వా రంగాన్ని APకి ఆశాకిరణంలా తీర్చిదిద్దుతాం: CBN

AP: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం మనల్ని బ్లూ ఎకానమీలో దేశంలోనే ముందు నిలిపాయన్నారు. ‘వేట నిషేధ సమయంలో 1.29L మందికి ₹20వేల చొప్పున ₹259 కోట్లు ఇచ్చాం. ఆక్వారంగం బలోపేతానికి ₹1.50కే యూనిట్ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్వా రంగాన్ని ఏపీకి ఆశాకిరణంలా తీర్చిదిద్దుతాం’ అని ట్వీట్ చేశారు.


