News August 22, 2024
ఇంగ్లండ్‌లో హర్మన్ సేన షెడ్యూల్ ఇదే

భారత మహిళల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. సొంతగడ్డపై మహిళల 2025 సీజన్ షెడ్యూలును ఈసీబీ ప్రకటించింది. హర్మన్ సేన ఇంగ్లండ్‌తో 5 టీ20లు, 3 వన్డేల సిరీసుల్లో తలపడనుంది. జూన్ 28న నాటింగ్‌హామ్, జులై 1న బ్రిస్టల్, 4న ఓవల్, 9న మాంచెస్టర్, 12న ఎడ్జ్‌బాస్టన్లో టీ20లు ఉంటాయి. జులై 16, 19, 22న సౌతాంప్టన్, లార్డ్స్, దుర్హమ్‌లో వన్డేలు జరుగుతాయి. 2026లో లార్డ్స్ వేదిక ఒక టెస్టు ఉంటుంది.
Similar News
News January 28, 2026
కెగెల్ వ్యాయామాల గురించి తెలుసా?

వయసు మీద పడటం, గర్భధారణ, ప్రసవం మూలంగా బలహీనమయ్యే కటి కండరాలను తిరిగి బలోపేతం చేసుకోవటానికి కెగెల్ వ్యాయామాలు చేయమని డాక్టర్లు సూచిస్తారు. కూర్చొని కటి కండరాలను పైకి, లోపలి వైపునకు లాగటానికి ప్రయత్నించాలి. వాటిని 5 సెకండ్ల పాటు పట్టి బిగించి, తర్వాత వదిలెయ్యాలి. దీంతో ఒక కెగెల్ వ్యాయామం పూర్తవుతుంది. ఇలా 10 సార్లు చేయాలి. ఇలా ఉదయం, సాయంత్రం 10 సార్ల చొప్పున చేయాలి.
News January 28, 2026
మా క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తోంది: భట్టి

TG: ప్రజాభవన్‌లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఫైరయ్యారు. సీఎం రేవంత్ దేశంలో లేనందున మున్సిపల్ ఎన్నికలపై తనకు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. మంత్రులు వారి సమస్యలు తెలియజేశారని, ఆ విషయాలను CMకు వివరించానని చెప్పారు. తమ క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తోందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని మధిరలో ధీమా వ్యక్తం చేశారు.
News January 28, 2026
విమాన ప్రమాదంపై డీజీసీఏ కీలక ప్రకటన

మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై DGCA వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. పైలట్ల నుంచి మేడే కాల్(సాయం కోరడం) రాలేదని వెల్లడించింది. రన్‌వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బందిపడ్డారని తెలిపింది. ‘ఇది టేబుల్ టాప్ రన్‌వే(ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉండే). తొలి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. రెండోసారి చేసిన ల్యాండింగ్ ప్రయత్నం విఫలమై కుప్పకూలింది’ అని వివరించాయి.


