News October 24, 2024

ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన TV షో ఇదే

image

ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన TV షోగా ‘The Lord of the Rings: The Rings of Power’ నిలిచింది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యింది. దీని మేకింగ్‌కు ₹3,800cr ఖర్చవగా, రైట్స్, ప్రమోషన్స్‌తో కలిపి మొత్తం ఖర్చు ₹8,300crకు చేరింది. ఒక్కో ఎపిసోడ్ తీయడానికి ₹480cr పెట్టారు. కల్కి, RRR, ఆదిపురుష్(₹588cr-₹630cr) బడ్జెట్‌తో పోల్చితే ఈ సిరీస్ బడ్జెట్ 15రెట్లు అధికం.

Similar News

News February 14, 2026

పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోయి..!

image

నలుగురు బాలికలు చేసిన వింత ప్రయోగం వారి ప్రాణాలను బలితీసుకుంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు సరదాగా పొలానికి వెళ్లి పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకొని తాగారు. నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోగా ఒక బాలిక వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించారనే బాధతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

News February 14, 2026

ఆ బౌలర్‌తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

image

రేపు పాక్‌తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని టీమ్‌ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్‌ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.

News February 14, 2026

ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

image

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.