News March 18, 2024
ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డుల హిస్టరీ ఇదే!

దేశంలోని ఎన్నికల్లో ఓటర్లకు తొలుత కేవలం పేరుతో ఉండే స్లిప్పులు ఇచ్చేవారు. ఫొటో గుర్తింపు కార్డులు ఇవ్వడంపై 1957లో ఆలోచన చేశారు. 1960లో కోల్కతా నైరుతి పార్లమెంటరీ ఎన్నికలో ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేయగా, విఫలమైంది. 1979లో సిక్కిం ఎన్నికల్లో, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఐడెంటిటీ కార్డు ప్రవేశపెట్టారు. 1994లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. 1997లో ఓటర్ల జాబితా కంప్యూటరీకరణ మొదలైంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 16, 2025
ఆ సినిమా నాకెంతో ప్రత్యేకం: రవితేజ

‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమా <<16027655>>రీరిలీజ్<<>> అవుతుండటంపై మాస్ మహారాజా రవితేజ ఇన్స్టాలో స్పెషల్ స్టోరీని పోస్ట్ చేశారు. ‘నేను చేసిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది నా మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈనెల 18న ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడులవుతోంది. బిగ్ స్క్రీన్పై ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నా’ అని ఆయన ఇన్స్టాలో రాసుకొచ్చారు.
News April 16, 2025
జపాన్ పర్యటనకు CM రేవంత్

TG: CM రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 22 వరకు తన బృందంతో కలిసి టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటిస్తారు. ఈనెల 21న ఒసాకా వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. 23న తిరిగి HYD చేరుకుంటారు.
News April 16, 2025
ALERT: లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

TG: LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.