News October 17, 2024
రిలయన్స్ బోనస్ షేర్ల హిస్టరీ ఇదీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూకు 99.92% స్టేక్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కంపెనీ అక్టోబర్ 28ని రికార్డు తేదీగా ప్రకటించింది. ఎలిజిబుల్ షేర్ హోల్డర్లకు 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లు జమ చేస్తారు. ఇప్పటి వరకు రిలయన్స్ ఐదు సార్లు బోనస్ షేర్లు ఇచ్చింది. 1980లో 3:5, 1983లో 6:10, 1997, 2009, 2017లో 1:1 రేషియోలో ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రూ.50,000 కోట్లు.
Similar News
News February 5, 2026
WPL-2026: ఫైనల్ క్వీన్ ఎవరో?

WPL-2026లో ఇవాళ ఢిల్లీ, బెంగళూరు మధ్య వడోదర వేదికగా ఫైనల్ జరగనుంది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ తొలి టైటిల్‌పై కన్నేసింది. ఈ సీజన్‌లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న RCB రెండో సారి ట్రోఫీ నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఆరు విజయాలతో ఢిల్లీదే పైచేయిగా ఉంది. అయినా 2024 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడటం DCని కలవరపరుస్తోంది.
మ్యాచ్: 7.30pm, లైవ్: జియో హాట్‌స్టార్, Star Sports.
News February 5, 2026
ఫిరాయింపు ఆరోపణలు.. ఆ ఇద్దరే బాకీ!

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.
News February 5, 2026
కల్తీ నెయ్యి కేసు.. ఇవాళ సీఎంతో పవన్, మాధవ్ భేటీ!

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.


