News October 2, 2025

‘చైనా ఆస్టర్’ సాగుకు ఇదే అనువైన సమయం

image

‘చైనా ఆస్టర్’ పువ్వులను కట్‌ఫ్లవర్‌గా, వేడుకల్లో డెకరేషన్ కోసం, పూజా కార్యక్రమాల్లో వాడుతుంటారు. ఈ పువ్వుల సాగుకు మంచి సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. అందుకే వీటిని అక్టోబర్ నెలలో నాటుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తారు. నీరు బాగా ఇంకే లోతైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలం. IIHR బెంగళూరు రూపొందించిన కామిని, వయోలెట్, కుషన్, శశాంక్, అర్చనా, పూర్ణిమ రకాలు అధిక పూల దిగుబడిని అందిస్తాయి.

Similar News

News February 12, 2026

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్లు

image

2023లో USలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి న్యాయం దక్కింది. ఆమె కుటుంబానికి $29 మిలియన్లు(రూ.262 కోట్లు) ఇచ్చేందుకు సియాటెల్ సిటీ విభాగం అంగీకరించింది. ‘జాహ్నవి మృతి బాధాకరం. ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం’ అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి <<13652111>>విలువలేదంటూ<<>> పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.

News February 12, 2026

ACTRECలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టాటా మెమోరియల్ సెంటర్ -అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్& ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ACTREC) 25 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM/DNB, MD, MSc/మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్/MBBS/BDS/BAMS/BHMS/ఫార్మా డీ, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://actrec.gov.in

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘చంద్రశేఖర’’

image

దక్షుడి శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణించి, ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రుడు శివుడిని శరణు వేడగా ఆయన కరుణించాడు. చంద్రుడిని తన తలపై నెలవంకగా ధరించాడు. అలా చంద్రుడికి పునర్జన్మనిచ్చి లోకానికి వెలుగు ప్రసాదించాడు. తనను ఆశ్రయించిన వారికి మృత్యు భయం ఉండదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చంద్రుడిని శిఖరంపై(తలపై) అలంకారంగా ధరించిన వాడు కాబట్టి ఆయనను ‘చంద్రశేఖరుడు’గా కీర్తిస్తున్నాం.