News October 4, 2025

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..

image

ఆస్ట్రేలియాతో ఈనెల 19 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. గాయం కారణంగా పంత్, హార్దిక్ దూరమయ్యారు.
టీమ్: గిల్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్(వైస్ కెప్టెన్), అక్షర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్, కుల్దీప్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, ధ్రువ్ జురెల్, జైస్వాల్.

Similar News

News October 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 25 సమాధానాలు

image

1. పంచవటి గోదావరి నదీ తీరాన ఉంది.
2. అజ్ఞాతవాసంలో అర్జునుడు ‘బృహన్నల’ అనే నపుంసక వేషంలో విరాట రాజభవనంలో ఉన్నాడు.
3. అష్టాదశ పురాణాలను ‘వేద వ్యాసుడు’ రచించారు.
4. హనుమంతుడు హిమాలయాల్లోని ‘ద్రోణగిరి’ పర్వతం నుంచి సంజీవని తీసుకొచ్చారు.
5. వ్యాసుడు రచించిన భాగవతంలో మొత్తం 12 స్కంధాలు ఉన్నాయి.
<<-se>>#ithihasaluquiz<<>>

News October 4, 2025

సరికొత్త కంటెంట్‌తో Way2News

image

✍️ ప్రతిరోజూ వ్యవసాయం, తెగుళ్లు, చీడపీడల నివారణ, పాడి సమాచారం కోసం ‘పాడి పంటలు’ కేటగిరీ
✍️ డైలీ ఆధ్యాత్మిక సమాచారం, ధర్మ సందేహాలు-సమాధానాలు, పంచాంగం, రాశి ఫలాల కోసం ‘భక్తి’ కేటగిరీ
✍️ ప్రతిరోజూ మహిళలు, గర్భిణుల ఆరోగ్యం, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం ‘వసుధ’ కేటగిరీ
✍️ డైలీ వివిధ రకాల ఉద్యోగాల కోసం ‘జాబ్స్’ కేటగిరీ
* యాప్ అప్డేట్ చేసుకోండి. స్క్రీన్‌పై క్లిక్ చేస్తే కింద కేటగిరీలు ఆప్షన్ కనిపిస్తుంది.

News October 4, 2025

థాంక్యూ రోహిత్.. అభిమానుల ట్వీట్స్

image

వన్డే క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా విశేష సేవలందించిన రోహిత్ శర్మ భారత జట్టును అగ్రస్థానంలో నిలిపారు. అయితే కొత్త కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడంతో రోహిత్ సేవలను గుర్తుచేస్తూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ‘2023 వరల్డ్ కప్‌లో 11 మ్యాచుల్లో ఇండియా పది గెలిచింది. టీ20 WC, CTని గెలవడంలో హిట్‌మ్యాన్ పాత్ర కీలకం. 8 నెలల్లో 2 ICC ట్రోఫీలు వచ్చేలా చేశారు. థాంక్యూ రోహిత్’ అని పోస్టులు చేస్తున్నారు.