News July 5, 2024

ఎంట్రీ ఇస్తే మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్దది!

image

జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్‌లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.

Similar News

News July 8, 2024

కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి ప్రభుత్వ ఉత్తర్వులు

image

TGలో కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. 35 మందిని నియమిస్తూ మార్చి 15నే జీవో రిలీజ్ చేయగా, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆగిపోయాయి. విత్తనాభివృద్ధి- అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం- మోహన్ రెడ్డి, కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్- జంగా రాఘవ్ రెడ్డి, ఫిషరీస్ సొసైటీస్- మెట్టు సాయి కుమార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా కాసుల బాలరాజును నియమించింది.

News July 8, 2024

అమానవీయం: ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని..

image

AP: బాపట్ల(D) చీరాల మం. కొత్తపాలెంకు చెందిన మణికంఠ రెడ్డి, కుసుమాంజలి 2021లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 20 రోజుల క్రితం భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న కుసుమాంజలి వారం క్రితం ప్రసవించింది. అప్పటికే ఓ ఆడబిడ్డ ఉండగా రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో కుసుమాంజలి పోలీసులను ఆశ్రయించింది.

News July 8, 2024

శాంసంగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్ట్రైక్

image

సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద స్ట్రైక్‌కు తెరతీశారు. యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్‌, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్ట్రైక్‌పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.