News July 26, 2024
ఈ భారత అథ్లెట్లకు ఇదే చివరి ఒలింపిక్స్

ముగ్గురు భారత అథ్లెట్లు తరుణ్‌దీప్ రాయ్ (ఆర్చరీ), ఆచంట శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), శ్రీజేశ్ (హాకీ)కు ఇదే చివరి ఒలింపిక్స్ కానుంది. ఇప్పటికే ఆర్చరీలో రాయ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా, ఈనెల 28న జరిగే మ్యాచ్‌తో శరత్ ఒలింపిక్స్ బరిలోకి దిగనున్నారు. గోల్ కీపర్‌గా రేపటి నుంచి ప్రారంభంకానున్న హాకీ మ్యాచుల్లో శ్రీజేశ్ పాల్గొంటారు. వీరికి హ్యాపీ ఎండింగ్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 31, 2026
ఒక్క రోజే రూ.85,000 తగ్గిన సిల్వర్ రేటు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కేజీ వెండి రేటు <<19009714>>రూ.55వేలు తగ్గగా<<>>, గంటల వ్యవధిలోనే మరో రూ.30వేలు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే సిల్వర్ రేటు రూ.85వేలు తగ్గి రూ.3,20,000కు చేరింది.
News January 31, 2026
యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే

AP: భూముల రీసర్వేలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ‘ప్రస్తుతం కొత్తగా చేపట్టే సర్వేలో భూయజమానిని తప్పనిసరిగా భాగస్వామిని చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆయన వచ్చాకనే రీసర్వే చేయాలి. భూ రికార్డు వివరాలను యజమానులకు చూపించి ఓకే అంటేనే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. ప్రతినెల 2-9 తేదీల మధ్య పాస్ పుస్తకాలు అందించాలి’ అని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది.
News January 31, 2026
పెసర, మినుములో తెల్లదోమ నివారణకు సూచనలు

పెసర, మినుము పంటల్లో తెల్లదోమల ముప్పు పెరిగింది. ఇవి పంటలను ఆశించి మొక్కల ఆకులోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులును కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 1.5ml లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తామర పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.


