News November 30, 2024
లాంగెస్ట్ బస్సు సర్వీసు ఇదే!

ఒక్క రోజంతా బస్సులో ప్రయాణిస్తేనే అంతా అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. కానీ, 50 రోజుల పాటు నిరంతరంగా బస్సులో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకునేవారనే విషయం మీకు తెలుసా? లండన్ నుంచి కోల్కతా వరకు ఉండే బస్సు సర్వీసును అత్యంత పొడవైన బస్సు మార్గంగా పరిగణిస్తుంటారు. 32,669 కి.మీల ఈ ప్రయాణ మార్గాన్ని 1957లో ప్రారంభించగా 1976 వరకూ కొనసాగింది. ప్రయాణం, ఆహారం, వసతితో కలిపి రూ.1933 (1960లో) తీసుకునేవారు.
Similar News
News December 17, 2025
ఏలూరు: నిరుద్యోగులకు GOOD NEWS

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీఎస్ఎస్డీసీ, ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ సంయుక్తంగా దుబాయ్లో జనరల్ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి జితేంద్ర తెలిపారు. 21-37 ఏళ్ల మధ్య వయసు ఉండి, అనుభవం కలిగిన పురుషులు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.24,450 జీతం ఉంటుందని, ఆసక్తి గల వారు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.
News December 17, 2025
పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.
News December 17, 2025
మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

మెస్సీ టూర్తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.


