News August 18, 2024

చంద్రబోస్ రాసిన లవ్ లెటర్‌ ఇదే!

image

పైనున్నది సుభాష్ చంద్రబోస్ 1936 Mar 5న ఎమిలీకి రాసిన ప్రేమ లేఖ. అందులో ‘మై డార్లింగ్, టైమ్ వస్తే మంచైనా కరగాల్సిందే. ప్రస్తుతం నా పరిస్థితీ ఇదే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా నేను జైలుకు వెళ్లొచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు. ఉరి తీయొచ్చు. నేను మళ్లీ నిన్ను చూడలేకపోవచ్చు. ఉత్తరాలూ రాయలేకపోవచ్చు. కానీ నువ్వెప్పుడూ నా గుండెల్లో ఉంటావు. ఇప్పుడు కాకపోతే మరు జన్మలో కలిసి ఉందాం’ అని ఉంది.

Similar News

News January 22, 2025

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం

image

AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.

News January 22, 2025

ఏంటీ ‘బర్త్ టూరిజం’?

image

పిల్లలకు US పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి అక్కడికి వెళ్తుంటారు. దీన్నే ‘బర్త్ టూరిజం’ అంటారు. US అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలికారు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా, తాత్కాలిక వీసాపై నివాసం ఉన్నా.. వారికి పుట్టబోయే బిడ్డకు జన్మత: అక్కడి పౌరసత్వం వర్తించదు.

News January 22, 2025

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి

image

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.