News August 26, 2025
దేశంలో అత్యంత విద్యావంతుడు ఇతడే!

ఇండియాలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరనే ప్రశ్నకు చాలా మందికి జవాబు తెలియకపోవచ్చు. ఆయనే మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. తన జీవితంలో 42 విశ్వవిద్యాలయ పరీక్షలు రాసి, ఏకంగా 20కి పైగా డిగ్రీలు పొందారు. MBBS & MD, LLB, LLM, MBA, జర్నలిజంలో పీజీ చేశారు. IPS & IAS కూడా అయ్యారు. అతి పిన్న వయస్కుడైన (26ఏళ్లలో) ఎమ్మెల్యేగానూ రికార్డులకెక్కారు. 2004లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.
Similar News
News August 26, 2025
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. Sensex 849 పాయింట్లు నష్టపోయి 80,786 వద్ద సెటిల్ అయ్యింది. Nifty 255 పాయింట్ల నష్టంతో 24,712 వద్ద స్థిరపడింది. శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, M&M, రిలయన్స్, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోగా ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ, నెస్లే, టీసీఎస్, ఆల్ట్రాటెక్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.
News August 26, 2025
రోహిత్‌ను తప్పించేందుకే బ్రాంకో టెస్ట్: తివారీ

2027 ODI WC నుంచి రోహిత్‌ను తప్పించేందుకే BCCI బ్రాంకో టెస్టును ప్రవేశపెడుతోందని మనోజ్ తివారీ ఆరోపించారు. ‘బ్రాంకో టెస్ట్ చాలా టఫ్. ఇందులో కోహ్లీ అర్హత సాధిస్తారు. కానీ రోహిత్‌తోపాటు మరికొందరికి కష్టమే. 2011WC తర్వాత యోయో పేరుతో యువీ, గౌతీ, సెహ్వాగ్‌ను పక్కనబెట్టినట్లే ఇప్పుడు కొందరిని తప్పించబోతున్నారు’ అని తెలిపారు. బ్రాంకో టెస్టులో ప్లేయర్ 6 నిమిషాల్లోనే 1,200 మీటర్లు పెరిగెత్తాల్సి ఉంటుంది.
News August 26, 2025
పెళ్లైన 30ఏళ్లకు ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య!

TG: నిర్మల్ జిల్లా వెల్మల్‌లో హరిచరణ్‌ను భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు మహేశ్ కలిసి హత్య చేశారు. గొంతుకు టవల్ బిగించి చంపేశారు. బాత్రూమ్‌లో మూర్ఛతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. తల్లిపై అనుమానంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. హరిచరణ్, నాగలక్ష్మికి 30 ఏళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు.